కొత్త క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలి..సీఐటీయూ నాయకులు డిమాండ్

by Jakkula Mamatha |
కొత్త క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలి..సీఐటీయూ నాయకులు డిమాండ్
X

దిశ ప్రతినిధి,తిరుపతి:కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు విఘాతంగా మారాయని సీఐటీయు అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం ధ్వజమెత్తారు. ఈ చట్టాలను రద్దు చేయాలని తిరుపతి కలెక్టరేట్ వద్ద బుధవారం సీఐటీయు అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఆటో డ్రైవర్ కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీఐటీయు అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్తగా తీసుకోబడిన భారత న్యాయ సంహిత చట్టం వల్ల డ్రైవర్ కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 304(A) ప్రకారం యాక్సిడెంట్‌లో ఎవరైనా చనిపోతే డ్రైవర్ కి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించేవారు లేదా స్టేషన్ బెయిల్ కానీ కోర్టు బెయిల్ కానీ పొందే వెసులుబాటు ఉండేదన్నారు. కానీ కొత్త చట్టం 161(1) ప్రకారం డ్రైవర్ కు ఐదేళ్లపాటు శిక్ష ఖరారు చేశారు. ఒకవేళ డ్రైవర్ పోలీస్ స్టేషన్లో గాని మెజిస్ట్రేట్ ముందు లొంగకపోతే అతను పరారీలో ఉన్నారని తెలిస్తే 161 (2) ప్రకారం పదేళ్లపాటు జైలు శిక్ష అమలు చేసేవిధంగా ఉందన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.Next Story

Most Viewed