చంద్రబాబుకు సీఐడీ షాక్..సుప్రీంకోర్టులో పిటిషన్

by Disha Web Desk 21 |
చంద్రబాబుకు సీఐడీ షాక్..సుప్రీంకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు ఆనందపడేలోపు సీఐడీ మోకాలడ్డుతుంది. స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్, అంగళ్లు కేసులో కూడా ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మిగిలిన కేసులు అంత తీవ్రమైనవి కావని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకునేలోపు ఏపీ సీఐడీ మరో షాక్ ఇస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. మంగళవారం ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు సీఐడీ లీగల్ టీం న్యూడిల్లీ చేరకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవకాశం ఉందని సీఐడీ ఆరోపిస్తోంది. చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని సర్వోన్న న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను లిస్ట్‌లో పొందుపరచాల్సి ఉంది.

బాబును వదలని సీఐడీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని గతంలో ఎన్నడూ లేనివిధంగా కేసులు వేధిస్తున్నాయి. ఒక దాని తర్వాత మరోక కేసులు పట్టుకుని పీడిస్తున్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా కోర్టు మెట్లెక్కడమే కాదు ఏకంగా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌కు వెళ్లారు. అయితే ఈనెల 20న చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయడు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని.. ఈనెల 29 నుంచి రాజకీయ చదరంగంలో కీలకంగా మారబోతున్నారని ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కోసం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడును కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో స్కిల్ స్కాం కేసులో విచారణ జరుగుతుండగానే ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదు చేసింది. ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ నెట్, మద్యం పాలసీ వంటి పలు కేసులలో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అంగళ్లు దాడి ఘటనపైనా విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విచారణలో ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసు, అంగళ్లు కేసులో ఉపశమనం కలిగింది. కానీ ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ నెట్, మద్యం పాలసీ వంటి కేసులపై విచారణ జరుగుతుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. త్వరలోనే తీర్పు వెల్లడించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.


ఐఆర్ఆర్ కేసులో విచారణ వాయిదా

అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అక్రమాల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం విచారణ ప్రారంభం కాగానే సీఐడీ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కోరింది. దీంతో న్యాయమూర్తి కేసు విచారణను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జడ్జిలను దూషించారంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


Read More..

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు: గడువు కోరిన సీఐడీ..చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా



Next Story

Most Viewed