మంత్రి రోజాకు టికెట్ కష్టమేనా..?

by Disha Web Desk 16 |
మంత్రి రోజాకు టికెట్ కష్టమేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా నగరిలో వర్గ పోరు భగ్గుమంది. మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కచ్చితంగా ఓడిస్తామని వ్యతిరేక వర్గం అంటోంది. గత రెండు సార్లు రోజా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అయితే నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి ఏమీ లేదనే టాక్ ఉంది. అంతేకాదు పార్టీలోని సొంత నేతలను ఆమె పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సొంత పార్టీ నేతలే ఆమె‌కు వ్యతిరేక వర్గంగా మారారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకు మళ్లీ సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని తేల్చి చెబుతున్నారు. రోజాకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని చెబుతున్నారు.

మరోవైపు 9 జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. నగరి సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈసారి విడుదల చేయబోయే లిస్టులో నగరి ఇంచార్జి పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.

దీంతో రోజాకు ఇంటిపోరు తప్పడంలేదు. రోజా అభ్యర్థిత్వాన్ని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతితో పాటు పుత్తూరు మండంల అమ్ములు, నిండ్ర, చక్రపాణిరెడ్డి, విజయపురంలో రాజు, వడమాల పేటలో మురళి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ల కూడా రోజా, ఆమె సోదరులు దోచుకోలేదని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెకు సీటు ఇస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed