27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల

by Disha Web Desk 16 |
27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల
X

దిశ, తిరుపతి: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. శ్రీవాణి కింద ప్రతిరోజూ 1000 టికెట్లు జారీ చేస్తారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.Next Story