టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు

by Disha Web Desk 16 |
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు
X

దిశ వెబ్ డెస్క్: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం కల్పించాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయించాలని, అది కూడా 6 నెలల్లోనే పూర్తి చేయాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. బంగారు తాపడాన్ని భక్తులు సమర్పించే బంగారంతోనే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో భక్తులకు యథావిధిగా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించనున్నారు. ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభించనున్నారు.

ఇక నందకం అతిథి గృహంలో రూ.2.95 కోట్లతో ఆధునాతనమైన ఫర్నీచర్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. రూ.9 కోట్ల వ్యయంతో ఘాట్ రోడ్డులో క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాలాజీ కాలనీలో రూ. 3 కోట్లతో స్థానికుల ఇళ్లకు మరమ్మతులు చేయించనున్నారు. పద్మావతి గృహంలో రూ. 3.8 కోట్లతో గదులు నిర్మించాలని కూడా టీటీడీ నిర్ణయించింది. జమ్ములో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.7 కోట్లు, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో హాస్టల్ గదుల నిర్మాణానికి రూ. 3.3 కోట్లు, తిరుపతి తాతయ్య అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.3.7 కోట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.


Next Story

Most Viewed