AP:వాడివేడిగా తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం..పలు అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

by Jakkula Mamatha |
AP:వాడివేడిగా తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం..పలు అంశాలకు ఏకగ్రీవ ఆమోదం
X

దిశ ప్రతినిధి,తిరుపతి:తిరుపతి అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసి పని చేద్దామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం బుధవారం ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హల్లో మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది. కమిషనర్ అదితి సింగ్ అజెండాను ప్రవేశ పెట్టరు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం హాజరు కాగా డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించి ఆమోదించరు.

ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి కోసం ఎంపి, ఎమ్మెల్సీ, మేయర్, కార్పొరేటర్లు, అధికారులు అందరి సహకారంతో పని చేద్దామన్నారు. తిరుపతిలో అండర్ డ్రైనేజీ సిస్టం పాతది అయిపోవడం, కొత్తగా యుడిఎస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శానిటేషన్ మెరుగు పరుచుకోవల్సిన అవసరం వుందని, త్రాగునీరు సాఫీగా సరఫరా జరిగేలా చూడాలని, ఇన్నర్ రహదారుల అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. టిడిఆర్ బాండ్లపై వస్తున్న ఆరోపణలపై ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15 లోపు అన్న, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed