Tirumalaలో తగ్గని భక్తుల రద్దీ.. భారీగా శ్రీవారి హుండీ ఆదాయం

by Disha Web Desk 16 |
Tirumalaలో తగ్గని భక్తుల రద్దీ.. భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
X

దిశ, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనం...మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం భక్తులకు దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని 61,368 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 25,578 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు


Next Story

Most Viewed