- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala News: అవి సాక్షాత్తు ఆ శ్రీవారి పాదాలే..!

దిశ, తిరుపతి: తిరుపతికి సమీపాన రామచంద్రపురం మండలంలోని నెన్నూరు, నడవలూరు పంచాయతీ మధ్యలో శ్రీవారి నామాలు ఉన్న పాదాలు ఆదివారం లభించాయి. ప్రార్థన కాలం నాటి పాదాలు అవి శ్రీవారి పాదాల అని నడవలూరు గ్రామస్తులు అన్నారు. ఈ క్రమంలో నేడు ఆదివారం లభించిన పాదాలను పై భాగం ఉన్న స్వామి వారి వారి దగ్గర జత చేర్చారు. రెండు సరిపోవడం తో అది శ్రీవారి పాదాలు అని నిర్ధారించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడి తిరుమలకు వస్తు ఏనుగుల పర్వతం పైన యోగులు సిద్ధ పురుషుల కోరిక మేరకు వారికి అభయమిచ్చి ముక్కోటికి వచ్చి చూ పవిత్రమైన నామ కాలవలో స్నానం ఆచరించి నామాలు ధరించారు. ఇలా తొమ్మిది రోజులు పాటు నామాలు ధరించిన స్వామి వారు ముక్కోటి చేరుకున్నారు. స్నానమాచరించిన ప్రదేశంలో స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం కార్వేటినగరం రాజులు, తమిళనాడు భక్తులు తిరుమలకు స్వామివారి దర్శనం కోసం గుండోడు కణం వచ్చే భక్తులు ఈ యొక్క నామ కాలువలో స్నానం చేసి నామాలు ధరించి స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు.
అయితే నవాబుల కాలంలో హిందూ దేవాలయాల దాడులు జరిగే సమయంలో ఈ యొక్క నామాల కాలవలో ఉన్న స్వామి విగ్రహంపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. గత కొంతకాలం ముందు స్వామి వారి పాదాలు లేకుండా విగ్రహం నామ కాలు పరిశీల ప్రాంతంలో బయటపడగా ఆ యొక్క విగ్రహాన్ని నడవలూరు గ్రామస్తులు తమ గ్రామంలో ఒక గుడి ఆవరణలో పెట్టారు. గత ఆదివారం నామాల కాలువ గట్టు పైన స్వామి పాదాలు బయటపడటంతో ఆ యొక్క పాదాలకు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని నామ కాలవలో పవిత్ర స్నానం చేసి గోవింద నామాలు పలికారు. గురువారం ఆ యొక్క పాదాలను పై భాగమైన స్వామి వారి విగ్రహం దగ్గర గత చేర్చారు. రెండు సరిపోవడం తో ఇవి స్వామి వారి విగ్రహాలన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని బాగు చేసి నామ కాలువ పరిషత్ ప్రాంతాల్లో నెలకొల్పుతామని గ్రామస్తులు తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గులా స్పందించి స్వామివారి నామాల కాలవను ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.