కాబోయే భర్తతో శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ బ్యూటీ

by Mamatha |
కాబోయే భర్తతో శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ బ్యూటీ
X

దిశ,తిరుమల:శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుల్లి తెర స్టార్ నటి, బిగ్ బాస్ షో బ్యూటీ ప్రియాంక జైన్ దర్శించుకున్నారు.తనకు కాబోయే భర్త, బుల్లితెర నటుడు శివ తో కలిసి తిరుమల చేరుకున్న ప్రియాంక బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం కాబోయే దంపతులను రంగనాయకుల మండపంలో ఆశీర్వదించిన అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆలయం బయట ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed