Tirupati: డ్రైవర్‌తో సహా టెంపో దగ్ధం!

by srinivas |
Tirupati: డ్రైవర్‌తో సహా టెంపో దగ్ధం!
X

దిశ, తిరుపతి: రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామపంచాయితీ వెంకటాపురం గ్రామంలో కోడి గుడ్లతో వెళ్తున్న టెంపో దగ్ధమైంది. విద్యుత్ తీగలు తగలడంతో టెంపో వాహనం పైభాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు పూర్తిగా అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే వాహనం మొత్తం దగ్ధమైంది. రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనలో డ్రైవర్ పాయాజ్ ఖాన్‌ సజీవదహనమైనట్లు స్థానికులు తెలిపారు. కానీ వాహనం కుడివైపు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో డ్రైవర్ సురక్షితంగానే ప్రమాదం నుంచి బయటపడినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed