శేషాచ‌లం అడ‌వుల్లో వైభవంగా ముక్కోటి ఆదివారం

by Disha Web Desk 16 |
శేషాచ‌లం అడ‌వుల్లో వైభవంగా ముక్కోటి ఆదివారం
X

దిశ, తిరుపతి: తిరుమల శేషాచ‌లం అడ‌వుల్లోని పుణ్యతీర్థాల్లో ఒక‌టైన శ్రీరామ‌కృష్ణతీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతి ఏటా మాఘ మాసంలో పౌర్ణమి రోజున శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలో భాగంగా రామకృష్ణ తీర్థంలో కొలువైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు శ్రీవారి ఆలయం అర్చక సిబ్బంది పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్రవ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

ఇక రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలీసుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ మజ్దూర్‌లు భక్తులకు దారి పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. పాపవినాశనానికి భక్తులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 30 బస్సులను ఏర్పాటు చేసింది. పాప వినాశనం వద్ద పార్కింగ్‌కు స్థలం పరిమితంగా ఉన్నందున గోగర్భం డ్యాం పాయింట్ దాటి ప్రైవేట్ ట్యాక్సీలు, జీప్‌లను అనుమతించలేదు. ఈ మధ్యాహ్నం తర్వాత భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు.

పాపవినాశనం డ్యాం వద్ద అంబులెన్స్‌తో పాటు మూడు పాయింట్ల వద్ద వైద్య బృందాలను ఉంచారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు 100 మంది శ్రీవారి సేవకులను నియమించారు. టీటీడీ, పోలీస్, ఆర్టీసీలోని సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానికులతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వందలాది మంది యాత్రికులకు ట్రెక్కింగ్ సాఫీగా జరిగేలా చూశారు.

READ MORE

Tirumala: కొనసాగుతున్న శ్రీవారి కానుకల లెక్కింపు

Next Story

Most Viewed