చిక్కుల్లో గాయని Mangli (మంగ్లీ).. ఆ నిర్ణయమే కారణం!

by Dishafeatures2 |
చిక్కుల్లో గాయని Mangli (మంగ్లీ).. ఆ నిర్ణయమే కారణం!
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) అడ్వైజర్ గా ప్రముఖ గాయని మంగ్లీని నియమించడంపై వివాదం రాజుకుంది. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన టీటీడీ ఆధ్యాత్మిక చానల్ కు ఏమాత్రం అవగాహన, అనుభవం లేని మంగ్లీని నియమించడమేంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మంగ్లీ నియామకం వల్ల చానల్ కు కొత్తగా చేకూరే ప్రయోజనమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు మంగ్లీకి, భక్తి చానల్ కు ఏమైనా సంబంధం ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మంగ్లీ ఎస్వీబీసీ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్లపాటు ఉండనున్నారు. నెలకి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ఆమెకు జీతం చెల్లించనుంది. అయితే బాధ్యతలు తీసుకోకపోయినా ఇప్పటికే ఆమెకు 7 నెలల జీతాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించింది. దీంతో బాధ్యతలు తీసుకోకపోయినా జీతం ఎలా చెల్లిస్తారంటూ ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మంగ్లీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్వహించిన ఎన్నికల సభల్లో మంగ్లీ తన ఆటపాటలతో ఓటర్లను ఆకట్టుకుంది. ఇందుకు నజరానాగా జగన్ ఆమెకు ఈ పదవి కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారు పదవి రావడానికి మంత్రి రోజా లాబీయింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆమెను తొలగించి అన్ని విధాల అర్హులైన వ్యక్తికి ఆ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Guntur: రోజానా మజాకా.. దద్దరిల్లిపోవాల్సిందే..!



Next Story

Most Viewed