Tirumala: భారీగా భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూ

by Disha Web Desk 16 |
Tirumala: భారీగా భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూ
X

దిశ, తిరుమల:కలియుగదైవం వెంకటేశ్వరస్వామి కొలువు తీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్ర, శనివారాల్లో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో కొండ మీదకు చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు తిరుమలలో వెంకటేశ్వరస్వామిని 74,583 మంది దర్శించుకున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 40, 343 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం రాత్రి వరకు భక్తులు హుండీలో రూ. 3. 37 కోట్లు ముడుపులు సమర్పించుకున్నారు.

ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టిక్కెట్లు ఉన్న భక్తులకు సకాలంలోనే స్వామివారి దర్శనం కలుగుతోంది. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి 36 గంటల సమయం పడుతోందని శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోయి క్యూలైన్లు శిలాతోరణం వరకు ఉన్నాయి. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండంటంతో టీటీడీ అధికారులు క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులకు మంచినీరు, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని, భక్తులు క్యూకాంప్లెక్స్‌ల్లో ఉండాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు.

Next Story