నిండు గర్భిణీ 65 కిలో మీటర్లు కాలినడక.. దారిలో ఆమెను చూసిన యువకుడు..!

by Dishanational2 |
నిండు గర్భిణీ 65 కిలో మీటర్లు కాలినడక.. దారిలో ఆమెను చూసిన యువకుడు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్యాభర్తలు అన్నాక చిన్న చితకా గొడవలు సహజం. ఏదైనా గొడవలు జరిగితే అర్ధం చేసుకునే మనస్థత్వాలు కొల్పోతున్నారు. చిన్న గొడవలకే పెద్ద నిర్ణయాలు తీసుకొని మనస్థాపానికి గురవుతున్నారు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బతుకు తెరువు కోసం వర్షిణి తన భర్తతో తిరుపతిలో నివాసం ఉంటుంది. వర్షిని నిండు గర్భవతి. బాగా మద్యానికి బానిసైన భర్త తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వర్షిణి భర్త నుండి దూరంగా వెళిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో తాను నిండు గర్భిణిని అని కూడా ఆలోచించకుండా వర్షిణి తిరుపతి నుంచి ఒంటరిగా కాలినడకన బయలుదేరింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక అలా నడుచుకుంటూ.. అక్కడక్కడా మార్గమధ్యలో ఆగుతూ 65 కిలోమీటర్లు నడిచి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకునే సరికి వర్షిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే దారిలో వెళ్తున్న యువకుడు ఆమెను చూసి.. 108 కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది హుటాహుటిన వర్షిణి వద్దకు చేరుకుని ఆమెకు వైద్య సహాయం అందించారు. అయితే అప్పటికే పురిటిలో బిడ్డ బయటకు వస్తున్నట్లు వర్షిణి చెప్పడంతో, అప్రమత్తమైన 108 సిబ్బంది కిరణ్ కుమార్, చిరంజీవి ఆమెకు అంబులెన్సులోనే ప్రసవం చేశారు. పుట్టిన ఆడబిడ్డ బరువు తక్కువగా ఉండటంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు.


Next Story

Most Viewed