‘ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడమే మాకు సవాల్’..నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Jakkula Mamatha |
‘ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడమే మాకు సవాల్’..నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ,తిరుమల:ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే తమకు పెద్ద సవాల్ అని సినీ నిర్మాత సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయనతో పాటు సినీ డైరెక్టర్ గోపీచంద్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ..శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు-2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కోసం బాధ్యతగా పనిచేయాలని ఆకాంక్షించారు. సినిమా టికెట్ల ధర పెంపు పై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకు రావడమే తమకు సవాల్ అని చెప్పారు.

Next Story