Yuvagalam Full Josh: కొత్త ఆలోచనలతో దూసుకెళ్తోన్న లోకేశ్

by Disha Web Desk 16 |
Yuvagalam Full Josh: కొత్త ఆలోచనలతో దూసుకెళ్తోన్న లోకేశ్
X

దిశ, తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వంద కిలోమీటర్లు దాటింది.. ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఆయన ప్రారంభించిన పాదయాత్ర భారీ జన సందోహం మధ్య సాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఆయన మాత్రం దూకుడుగానే వెళ్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారి బాధితులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ సమావేశంలో లోకేశ్ మాట్టాడుతూ 'నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేసినా మూడు నెలల అమీర్ పేట కోర్సు కోసం స్టూడెంట్స్ పరుగెడుతున్నారు. ఎందుకిలా? ఆ అమీర్‌పేట కోర్సులు కాలేజీల్లో ఎందుకు నేర్పకూడదు? . మేము అధికారంలోకి వస్తే అదే పని చేస్తాం.' అని చెప్పారు. ఓ స్కూల్ పిట్టగోడ నుంచి పిల్లలతో మాట్లాడుతూ టీచర్లను ఎలా గౌరవించాలో చెప్పారు.

అయితే వందో కిలోమీటర్ పూర్తయిన తర్వాత గుర్తుగా సొంత డబ్బుతో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని శిలాఫలకం వేశారు. దీంతో లోకేష్ ఆలోచనా శైలిపై కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేసింది. అదే సమయంలో ప్రభుత్వంపై పంచ్‌లకు లెక్కలేదు. పెంచుకుంటూ పోతానన్నాడని.. అప్పట్లో అర్థం చేసుకోలేకపోయామంటూ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతేకాదు పథకాల పేరుతో చేస్తున్న మోసాలని పవర్ ఫుల్‌గా వినిపించగలుతున్నారు. 'లోకేష్ అంటే వైసీపీ సోషల్ మీడియా వందల కోట్లు ఖర్చు చేసి మార్ఫింగ్‌లు చేసి చేసిన ఫేక్ ప్రచారంలో ఉన్న లోకేష్ కాదని, అసలైన లోకేష్ వేరు.' అని లోకేశ్ చెప్పుకున్నారు.

READ MORE

వాణీజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు



Next Story