Tufan Effect: చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం

by Disha Web Desk 16 |
Tufan Effect: చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం
X

దిశ వెబ్ డెస్క్: తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పలు మండల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. తిరుపతి జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురుస్తోంది. వరదయ్య పాలెం, బీఎన్‌కండ్రిగ, కేవీబీపురం, సత్యవేడులో భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలతో సహాయ చర్యలు చేపడుతున్నారు.


Next Story