Doctor Ramesh: మర్మ చికిత్సతో అన్ని రకాల వ్యాధులు దూరం

by Disha Web Desk 16 |
Doctor Ramesh: మర్మ చికిత్సతో అన్ని రకాల వ్యాధులు దూరం
X

దిశ, తిరుపతి: మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను దూరం చేయవచ్చని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు, బెంగుళూరుకు చెందిన ట్రాన్స్ డీసీప్లీనరీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రమేష్ తెలిపారు. తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బుధవారం మర్మ చికిత్స విధానంపై ప్రయోగాత్మకంగా వివరించారు.

ఈ సందర్భంగా "మర్మ చికిత్స - ఏ ఏ వ్యాధులలో ఉపయోగించాలి" అనే అంశంపై ప్రసంగించారు. మన శరీరంలో 107 ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని, వాటిని గుర్తించి తగినంత ఒత్తిడి కలిగించడం ద్వారా చాలా రకాల వ్యాధులను నయం చేయవచ్చని రమేష్ తెలిపారు. వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మర్మ చికిత్స ద్వారా తక్షణమే నొప్పి నివారణ అందించవచ్చని చెప్పారు. ఎటువంటి ఔషధం లేకుండా కేవలం మర్మ ప్రత్యేక స్థానాలపై ఒత్తిడి కలిగించి, వ్యాధులను నివారించే ఈ చికిత్స విధానం చాలా ప్రాచీనమైనదని, ఆయుర్వేద, సిద్ధ వైద్య గ్రంథాల్లో వివరించబడినట్లు చెప్పారు. దేశ విదేశాలలో మర్మ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆధ్యాపకులు డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed