Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

by Disha Web Desk 16 |
Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ధ్వజారోహనంతో ప్రారంభమైన బ్రహ్మోతాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. మరికాసేపట్లో పెద్ద శేషవాహన సేవ ప్రారంభంకానుంది. మరోవైపు శ్రీవారి నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగిపోతున్నాయి. భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటంబ సమేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.

అంతకుముందు సీఎం జగన్ మోహన్‌రెడ్డి తిరుపతిలో పర్యటించారు. నగరంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభించారు. రూ.684 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరపడతుందని సీఎం తెలిపారు. నాలుగేళ్లలో ఈ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశామని చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించడంతో పాటు ఎస్వీ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాలు కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు. దాదాపు 6 వేల 700 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. మరో 3 వేల 500 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. నెల నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed