ఈనెల 25న సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తిలో పర్యటన.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
ఈనెల 25న సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తిలో పర్యటన.. కారణం ఇదే!
X

దిశ,శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25వ తేదీన శ్రీకాళహస్తికి రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీకాళహస్తిలో ఈనెల 21 నుంచి మార్చి ఆరో తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

26వ తేదీన మహాశివరాత్రి. 25వ తేదీన ముఖ్యమంత్రి శ్రీకాళహస్తికి వచ్చి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా మంత్రి లేదా ఇంచార్జి మంత్రులు ఇప్పటివరకు శివరాత్రికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రావడం ఇదే మొదటిసారి. అదేవిధంగా 23వ తేదీన ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Next Story

Most Viewed