ఏపీలో టెన్త్ పేపర్ లీక్.. వాట్సప్‌లో హల్‌చల్

by Disha Web |
ఏపీలో టెన్త్ పేపర్ లీక్.. వాట్సప్‌లో హల్‌చల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టెన్త్ పబ్లిక్ పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమై అందరినీ షాక్‌కు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. చిత్తూరుకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో తెలుగు కాంపోజిట్ పేపర్ ప్రత్యక్షమైంది. ఈ వార్తలతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఈవో పురుషోత్తం చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రం ఎవరో కావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారని డీఈవో చెబుతున్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కాగా పేపర్ లీక్ పై కలెక్టర్ హరినారాయణన్ స్పందించారు. "జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు బాగా పరీక్ష రాస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయినట్లు డీఈవోకు సమాచారం అందింది. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థులెవరూ పుకార్లను నమ్మొద్దు" అని ఆయన సూచించారు.


Next Story

Most Viewed