ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలి-నారా భువనేశ్వరి

by Disha Web Desk 18 |
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలి-నారా భువనేశ్వరి
X

దిశ, గంగాధర నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. శుక్రవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం వివిపురం పంచాయతీ గంగమ్మ గుడి గ్రామంలో జరిగిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోవడంతో గత ఐదేళ్లలో రాష్ట్రం 30 ఏళ్లకు వెనకబడిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. మరో రెండు నెలల్లో టిడిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ సందర్భంగా మృతి చెందిన కర్ణం ఆంజనేయులు నాయుడు కుటుంబాన్ని పరామర్శించి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ థామస్, పార్టీ అధ్యక్షులు జయశంకర్ నాయుడు, పెనుమూరు మండల టీడీపీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు, తిరుపతి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు భీమినేని చిట్టి బాబు నాయుడు, పెనుమూరు మాజీ సర్పంచ్ పెద్దినేని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed