Nellore: ఒరిశా రైలు ప్రమాద బాధితులకు కొవ్వొత్తుల నివాళి

by srinivas |
Nellore: ఒరిశా రైలు ప్రమాద బాధితులకు కొవ్వొత్తుల నివాళి
X

దిశ, నెల్లూరు రూరల్: ఒరిశా రైలు ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని గూడూరులో సీఐటీయూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అశ్రునివాళి అర్పించారు. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారు బోయిన రాజా మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన రైల్వేల ప్రైవేటీకరణ విధానాల ఫలితమే ఒరిశా ఘోర రైలు ప్రమాదమని విమర్శించారు బీజేపీ ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. 2014లో 13 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, ఇప్పుడు అవి తొమ్మిది లక్షలుగా ఉన్నాయని, మిగిలిన రైల్వేలో ఖాళీగా ఉన్న 4 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. భద్రత వ్యవస్థను పటిష్టం చేయాలని, ఒరిశా రైలు ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story