Tirumala:తిరుమలలో అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు

by Jakkula Mamatha |
Tirumala:తిరుమలలో అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు
X

దిశ, తిరుమల: తిరుమల అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి నారాయణ గిరి షెడ్లను శుక్రవారం వేకువజామున ఆకస్మిక తనిఖీ చేశారు. యాత్రికులకు భోజన, పాలు సకాలంలో అందుతున్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. చలికాలం కావడంతో వేడి పాలు నిరంతరాయంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేటట్లుగా చూడాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో వేచి ఉన్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed