డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by Gantepaka Srikanth |
డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సర్కారు కొలువుదీరింది. అందరూ అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, మంత్రులుగా మరో 24 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ మహా ఘట్టానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. స్టేట్‌గా గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా(ఎక్స్)లో భావోద్వేగభరిత ట్వీట్ పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.Next Story

Most Viewed