జైల్లో చంద్రబాబు భద్రత మా బాధ్యత : మంత్రి బొత్స సత్యనారాయణ

by Disha Web Desk 21 |
జైల్లో చంద్రబాబు భద్రత మా బాధ్యత : మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైల్లో చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. విజయనగరంలో మంగళవారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంద‌ని వెల్లడించారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌లో ఏదైనా లోపం జరిగితే దానికి పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం వెనుక తమ ప్రమేయం లేదని అన్నారు. వైసీపీ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిందన్న వార్తలను మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టి పారేశారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాంలో అక్రమాలకు పాల్పడటం వల్లే చంద్రబాబు రిమాండ్ కు వెళ్లారని చెప్పుకొచ్చారు. ఈ ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన ప్రమేయం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందని అన్నారు.

మహిళా బిల్లుకు మా మద్దతు

ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మ‌హిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌డాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ స్వాగతించారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడడం కేబినెట్ ఆమోదం తెలపడం అభినందనీయమని కొనియాడారు. మ‌హిళా బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామ‌ని స్పష్టం చేశారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిపాదించిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు తాము పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మ‌హిళ‌ల‌ అభివృద్ధికి, సంక్షేమానికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు. మహిళా సాధికారత తమ ప్రభుత్వం పాటుపడుతుందని అందుకు నిదర్శనమే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు తాము కేటాయించడం అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.



Next Story