చంద్రబాబు సంచలన నిర్ణయం.. సీఎంగా మొదటి సంతకం ఆ ఫైలు పైనే..!!

by Mahesh |
చంద్రబాబు సంచలన నిర్ణయం.. సీఎంగా మొదటి సంతకం ఆ ఫైలు పైనే..!!
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో కూటమి అసెంబ్లీ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఈ నెల 12న బాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి బాబు నిర్ణయించారని.. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలలోనే జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పనకు సంబంధించిన ఫైల్ పై కూడా చంద్రబాబు సంతకం చేయనున్నారని తెలుస్తుంది.

Next Story

Most Viewed