బ్రేకింగ్.. సాయంత్రం నాలుగు గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదల

by Dishafeatures2 |
బ్రేకింగ్.. సాయంత్రం నాలుగు గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. అనారోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ వల్ల బాబుకు నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఉత్తర్వులు అందిన తర్వాత సాయంత్రం బాబును రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబసభ్యులు నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి రాజమండ్రిలోనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబు అడ్మిట్ కానున్నారు. అటు చంద్రబాబుకు మధ్యంతర బైలు రావడంతో తెలుగు తమ్ముళ్లు సంబురాల్లో మునిగిపోయారు.

Read More: యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయ్యింది: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నారా లోకేశ్

Next Story

Most Viewed