హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు.. క్వాష్ పిటిషన్ దాఖలు

by Dishafeatures2 |
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు.. క్వాష్ పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శనివారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ మేరకు బాబు తరపున ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్‌లో తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ చెల్లదని, ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని సుప్రీంను కోరారు.

సోమవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించనుండగా.. సీఐడీ తరపున కూడా వాదనలు జరగనున్నాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయం కీలకంగా మారింది. కేసు విచారణలో ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమని నిన్న తీర్పులో హైకోర్టు పేర్కొంది. సీఐడీ వాదనలకు హైకోర్టు ఏకీభవించింది. ఈ తీర్పును అధ్యయనం చేసిన టీడీపీ లీగల్ టీమ్.. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.



Next Story

Most Viewed