టీడీపీ సీనియర్ నేతపై దాడి చేసిన ఆంబోతుకి కళ్లెం వేస్తా..టీడీపీ అధినేత

by Indraja |
టీడీపీ సీనియర్ నేతపై దాడి చేసిన ఆంబోతుకి కళ్లెం వేస్తా..టీడీపీ అధినేత
X

దిశ డైనమిక్ బ్యూరో: పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీడీపీ నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ పై వైసీపీ నేతలు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై తాజాగా తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్పందిచారు. ఈ రోజు రాజమహేంద్రవరం లో నిర్వహించిన రా కదిలిరా భహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు వైసీపీ నేత అంబటి రాంబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ పై ఆంబోతు రాంబాబు దాడి చేసారు అని మండిపడ్డారు. ఆంబోతు నీకు కళ్లెం వేస్తా అని ఆయన అంబటి రాంబాబును ఎద్దేవ చేశారు.. ప్రతి దానికి సమాధానం చెపుతాం అంటూ అంబటి రాంబాబును హెచ్చరించారు. అలానే ఏది మర్చిపోమని.. చేసిన ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తాం జాగ్రత్తగా ఉండు అంటూ.. రాజమహేంద్రవరం నుండి గర్జిస్తూ హెచ్చరిస్తున్న అని అంబటి రాంబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక నాయకుడిగా తన నేతలను గాలి వదిలేయకుండా చంద్రబాబు తన నేతలను సంరక్షించుకుంటున్నారు. ఇక పల్నాడు జల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీడీపీ నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేతలు రాళ్లతో దాడిచేసిన విషయం అందరికి సుపరిచితమే. ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంలో వైసీపీ నేతలు రాళ్ల దాటికి పాల్పడి గందరగోళ పరిస్థితులను సృష్టించారు.

Next Story

Most Viewed