చంద్రబాబు పవన్ భేటీ.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
చంద్రబాబు పవన్ భేటీ.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిన్న భేటీ కాగా ఇదే అంశంపై వైసీపీ నేత, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండి పడ్డారు. దొంగను కలిసిన వారిని ఏమంటారు అని ప్రశ్నించారు. ఎంత మంది కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేరన్నారు. జగన్ కోసం ఒక సైన్యమే పనిచేస్తోందన్నారు. కాగా ఆదివారం ఏపీలో ప్రతిపక్షాల హక్కులను వైసీపీ కాలరాస్తోందని.. జీవో నంబర్ 1ని రద్దు చేయాలని చంద్రబాబు, పవన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించిన పవన్ నిన్న చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.

Next Story

Most Viewed