వైద్య రంగంపై YS JAGAN బొంకుడు ప్రకటనలు: Chandrababu Naidu

by Disha Web Desk 21 |
వైద్య రంగంపై YS JAGAN బొంకుడు ప్రకటనలు:  Chandrababu Naidu
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంపై సీఎం వైఎస్ జగన్ అసత్య ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు నిండు అసెంబ్లీలో అసత్యాలు చెప్పారని.. బయట సమావేశాల్లో కూడా అవే చెప్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మంగళగిరికి ఎయిమ్స్ వస్తే దానికి ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటని ట్వీట్ చేశారు. 'రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీసం నీటి సరఫరా చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి.

అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా?'అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 'నాడు తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్‌కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవలకు ఈ ప్రతిష్టాత్మక సంస్థను సిద్ధం చేశాం. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

వైద్య రంగంలో మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు

రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ పదే పదే అబద్దాలు చెప్పారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించడం లేదు.

పైగా వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ALSO READ : ఎందుకు బాధ్యత తీసుకోరు.. జగన్ సర్కార్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు!

Next Story

Most Viewed