గుణదల మేరీమాత సన్నిధిలో చంద్రబాబు

by Seetharam |
గుణదల మేరీమాత సన్నిధిలో చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో 53 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇక షురూ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి దర్శనం మెుదలుకొని సింహాచలం అప్పన్నస్వామి, శ్రీశైలం మల్లన్న స్వామితోపాటు పలువురు దేవుళ్లను దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ కనకదుర్గమ్మను సైతం దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. తాజాగా గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాత చర్చికి వెళ్లారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు చర్చి ఫాదర్‌లు ఆశీర్వనచనం అందజేశారు. అనంతరం మేరిమాత విగ్రహాన్ని అందజేశారు.

Next Story