ఐదు రోజులుగా కలెక్టరేట్‌లోనే చంద్రబాబు

by Mahesh |
ఐదు రోజులుగా కలెక్టరేట్‌లోనే చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: గత నెల చివర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ(Vijayawada) అతలాకుతలం అయింది. గంటల వ్యవధిలోనే ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి వర్షం కురవగా.. బెజవాడలోని బుడమేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu).. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఐదు రోజుల నుంచి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటూ.. నిత్యం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా ఈఎంఐల రీ షెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. అనంతరం బ్యాంక్ అధికారులకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed