ఏం బతుకయ్యా జగన్ రెడ్డి: సీఎంపై చంద్రబాబు ఫైర్

by Satheesh |
ఏం బతుకయ్యా జగన్ రెడ్డి: సీఎంపై చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏం బతుకయ్యా జగన్ రెడ్డి.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారులను ఒత్తిడి చేసి అడ్డుపడుతావా అని ప్రశ్నించారు. పులివెందుల టీడీపీ నేత ఎమ్మెల్సీగా గెలిచాడన్న అక్కసుతో అరెస్ట్ చేయించావు.. ఇంతకంటే నువ్వు ఇంకేం భ్రష్టుపట్టి పోవాల్సింది ఉందని విమర్శల చేశారు. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇచ్చే విషయం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లు ప్రకటించినప్పటకి ఎన్నికల అధికారి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చేయగా.. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో ఆదివారం ఉదయం ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డికి ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఫామ్‌ను అందించారు.

Next Story