Ap News: గ్రామ, వార్డు వలంటీర్లకు ఈసీ షాక్.. చర్యలు తప్పవని హెచ్చరిక

by Disha Web Desk 16 |
Ap News: గ్రామ, వార్డు వలంటీర్లకు ఈసీ షాక్.. చర్యలు తప్పవని హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల విధులకు గ్రామ, వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, విధులకు వార్డు, గ్రామ వలంటీర్లను దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వలంటీర్లపై ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని గ్రామ, వార్డు వలంటీర్లను ఆదేశించింది.

కాగా రాష్ట్రంలో ఈ నెల 13న టీచర్, పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీ రంగంలోకి దిగాయి. తమ పార్టీ తరపున మద్దతు తెలుపుతూ అభ్యర్థులను బరిలో దింపాయి. తాము మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించి ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ఈ ప్రక్రియలో వలంటీర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అర్హులను గుర్తించి పథకాలు అందజేస్తున్నారు. దీంతో గ్రామ, వార్డులో ప్రతి ఒక్కరితో వలంటీర్లకు పరిచయం ఉంది. ఈ చొరవతో ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీస్తున్నారని గతంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు కూడా ఫిర్యాదులు అందడంతో ఈ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది.



Next Story

Most Viewed