సీఎం జగన్‌కు సీఈసీ బిగ్ షాక్

by Disha Web Desk 22 |
సీఎం జగన్‌కు సీఈసీ బిగ్ షాక్
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండటానికి ప్రతీ పార్టీకి ప్రతీ రెండేళ్లకోసారి సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుని దానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలన్న నిబంధనను వైసీపీకి ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసింది.

ఇకపోతే గుంటూరు జిల్లా వేదికగా జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఆర్టికల్ 8, 9 ప్రకారం పార్టీ అధ్యక్షుడు ఇక శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఈ ఎన్నికపై వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సీఈసీకి ఫిర్యాదు చేశారు. పీపుల్ యాక్ట్ 1951 ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. శాశ్వత అధ్యక్షుడు పదవి అనేదే అశాశ్వతమని రఘురామ తెలియజేసిన సంగతి తెలిసిందే.



Next Story