YSRCP:వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-07 10:55:05.0  )
YSRCP:వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ(YCP)కి మరో షాక్ తగిలింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) పై కేసు నమోదైంది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ ఇసాక్ పై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. బాధితుడు సలాం ఎమ్మెల్సీ ఇసాక్ మసీదు నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More..

Ys Jagan: ఇంత దారుణమా.. మేమెప్పుడూ చూడలేదు?

Advertisement

Next Story