జూ.ఎన్టీఆర్‌కు టీడీపీతో సంబంధం లేదు..బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

by Mamatha |
జూ.ఎన్టీఆర్‌కు టీడీపీతో సంబంధం లేదు..బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే చర్చలు జరుగుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సినీ నటులు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. ఆయనకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడుతూ..టీడీపీ బాధ్యతలు నారా లోకేష్‌కు అప్పగించాలని పునరుద్ఘాటించారు.

Next Story