ఏపీలో కవిత క్రేజ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

by Disha Web Desk 16 |
ఏపీలో కవిత క్రేజ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలో పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంగండ గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పునరుద్ధరణ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొన్ని అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. బ్రిటీష్ హయాంలో అమ్మవారి ఆలయాన్ని కాపాడేందుకు గ్రామస్తులు ఎంతో సాహసం చేశారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ముత్యాలమ్మ తల్లిని తాను కోరుకున్నానని చెప్పారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా కడియంలో నర్సీలను ఆమె సందర్శించారు. గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఈ కడియం నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేశారని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

అయితే ఎమ్మెల్సీ కవితకు రెండు చోట్ల అపూర్వ స్వాగతం లభించింది. ఆమెతో స్థానికులు ఆప్యాయంగా పలకరించారు. కవితతో సెల్పీలు దిగేందుకు రెండు గ్రామాల్లోనూ ప్రజలు భారీగా పోటీ పడ్డారు. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి కవితను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

Read More..

టీడీపీ కార్యకర్తలుకు క్యాంప్ కార్యాలయం ఎప్పు డు జనతా గ్యారేజ్!



Next Story

Most Viewed