BREAKING: సీఎం జగన్‌పై దాడి ఎఫెక్ట్.. పోలీసు శాఖ సంచలన నిర్ణయం

by Disha Web Desk 1 |
BREAKING: సీఎం జగన్‌పై దాడి ఎఫెక్ట్.. పోలీసు శాఖ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై రాయితో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు సతీశ్‌కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ భద్రతపై పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌కు వ్యక్తిగత సిబ్బందిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది బ్రౌన్ కలర్ డ్రెస్‌లో సఫారీ సూట్‌లో అదనంగా జగన్ వెంట 50 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇక నుంచి యాత్ర కొనసాగే ప్రాంతాలను సెక్యూరిటీ సిబ్బంది నిరంతనం బైనాక్యులర్ క్షుణ్ణంగా వీక్షించి దాడలను ముందే పసిగట్టనున్నారు.

కాగా, ఈ నెల 13న విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయం అయింది. అదేవిధంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఎడమ కంటికిసైతం బలంగా రాయి తగిలింది.



Next Story

Most Viewed