ఎన్నికల ఫలితాల వేళ జనసేన పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

by Shiva |
ఎన్నికల ఫలితాల వేళ జనసేన పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మంగళవారం స్వగ్రామం ఆయన పిఠాపురం నియోజవర్గ పరిధిలోని యు. కొత్తపల్లి మండలం నాగులపల్లిలో ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, సంపర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న జనసేన, కాంగ్రెస్ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Next Story