BREAKING: రాష్ట్రంలో మరో సంచలన ఘటన.. తొమ్మిదేళ్ల చిన్నారిపై కిరాతకంగా మైనర్ల అత్యాచారం ఆపై హత్య

by Shiva Kumar |
BREAKING: రాష్ట్రంలో మరో సంచలన ఘటన.. తొమ్మిదేళ్ల చిన్నారిపై కిరాతకంగా మైనర్ల అత్యాచారం ఆపై హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు కామ పిశాచులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి బామ్మలనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి వారిపై లైంగిక వేధింపుల పాల్పడుతూ నిత్యం నరకం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అభం..శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికపై మైనర్లు అతి కిరాతకంగా ఆత్యాచారానికి పాల్పడి హతమార్చిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రిలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు సమీపంలోని పార్క్‌కు తొమ్మిదేళ్ల చిన్నారి వెళ్లింది. అయితే, రాత్రి అయిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లలోను వెతికారు.

అయినా, ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. వాళ్ల బాధను చూడలేక గ్రామస్థులు సైతం పాప కోసం తీవ్రంగా గాలించారు. కాగా, పార్క్‌లో బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు మైనర్లు అక్కడి వచ్చి ఆమెను తీసుకెళ్లినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది. ఆ కోణంలో విస్తృతంగా గాలింపు చేపట్టగా.. నిందితులు చివరకు పోలీసులకు చిక్కారు. అయితే, బాలికను తామే తీసుకెళ్లామని, ఒకరి తరువాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా విచారణలో ఒప్పుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ముచ్చుమర్రి పంప్ హౌజ్ సమీపంలోని కాలువలో పడేసినట్లుగా పేర్కొన్నారు. మృతురాలి తల్లిద్రండుల ఫిర్యాదు మేరకు ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తును ముమ్మరం చేశారు.

Next Story

Most Viewed