ఏపీలో దొంగ ఓట్లు.. ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ చీఫ్

by srinivas |
Purandeswari
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దొంగ ఓట్లు ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటర్ లిస్టులో ఓట్లు ఉంటున్నాయి. ఎవరూ లేని ఇళ్లలో కూడా పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్లు ఎవరికి అనుకూల మవుతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు పారదర్శకంగా పని చేయాలని సూచిస్తున్నాయి.

అయితే ఏపీలో దొంగ ఓట్లపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇటీవల ఓ ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు ఐపీఎస్, అధికారులపై పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం కోసం పని చేయాలని, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు అధికారులు అనుకూలంగా వ్యవహరించకూడదన్నారు. అధికారులు తప్పులు చేయొద్దని.. అలా చేస్తే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి హెచ్చరించారు. తాము ఫిర్యాదు చేయడం వల్లే ఐఏఎస్ అధికారి గిరీషా విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వైసీపీ నాయకులు, అధికారులు కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వైసీపీ తక్కవ మార్జిన్‌తో ఓడి పోయే చోట ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని.. తమకు సమాచారం ఉందని తెలిపారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తామని మంత్రి ధర్మాన చెబుతున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. మంత్రి చేసిన కామెంట్లు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

Read More..

BREAKING: మళ్లీ తెరపైకి నాగార్జున‌ సాగర్‌ డ్యామ్‌ వివాదం.. రంగంలోకి దిగిన కేఆర్ఎంబీ బృందం



Next Story

Most Viewed