రైతులకు కొండంత నష్టం జరిగితే గోరంత పరిహారం ఇస్తారా? : విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk |
రైతులకు కొండంత నష్టం జరిగితే గోరంత పరిహారం ఇస్తారా? : విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలతో రైతులకు కొండంత నష్టం జరిగితే వైసీపీ ప్రభుత్వం గోరంత పరిహారం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయింది 47, 999 మంది రైతులేనా ? అని ప్రశ్నించారు. ఇచ్చే పరిహారం రూ. 44 కోట్లేనా ? అందులోనూ ఇన్ పుట్ సబ్సిడీ పేరు ! అంటూ మండిపడ్డారు. మరి సర్వం కోల్పోయిన రైతులకు చేసే సాయం ఏమిటి? అని ట్విటర్ వేదికగా నిలదీశారు. పంట నష్టం జరిగినప్పుడు కనీసం రైతులను ఈ ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు..చివరకు న్యాయం కూడా చేయకుండా ముంచేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఇలా గాలికొదిలేసిన ప్రభుత్వం చరిత్రలో ఉండదేమో ? అని ధ్వజమెత్తారు. తక్షణం పంట నష్టం ఎన్యూమరేషన్ వివరాల్ని బహింరగపరిచి. .. ఎకరానికి రూ. ఇరవై వేల పరిహారం ప్రకటించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. లేకపోతే అధికారం ఇచ్చిన రైతులే కుర్చీ దింపేస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read..

ప్రజల్లోకి టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ స్కీమ్స్


Next Story

Most Viewed