బీజేపీ ఏపీ కొత్త చీఫ్ పురంధేశ్వరికి సోము వీర్రాజు శుభాకాంక్షలు

by Dishafeatures2 |
బీజేపీ ఏపీ కొత్త చీఫ్ పురంధేశ్వరికి సోము వీర్రాజు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురంధేశ్వరికి అక్కడి బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వివిధ స్థాయిల్లో బీజేపీకి ఆమె సేవలందించారని పురంధేశ్వరిని కొనియాడారు. ఆమె అపార రాజకీయ అనుభవం ఏపీలో పార్టీ విస్తరణ, బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ నేషనల్ ఎగ్జిగ్యూటివ్ సభ్యుడిగా ఎంపికైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సోమువీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story