- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. మరోసారి నోటీసులు జారీ
దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు హాజరు కావాలని కోరారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు జోగి రమేష్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు మరోసారి మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆయనను విచారిస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్, దేవినేని అవినాష్‌లు తొలుత ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును(High court) ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి భారీ ఊరట లభించింది. వారిద్దరి పై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వారు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.