చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు

by Seetharam |
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది.అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.


బెయిల్‌కు దోహదపడిన అంశాలివేనా?

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్టైన వారెవరూ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జైలులో ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే 52 రోజులపాటు జైలులో ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అనారోగ్య సమస్యలను సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం మరోవైపు గుండె పరిణామం పెరగడం ఇలాంటి కారణాల దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 9న అరెస్ట్

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్ 10న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు నాయుడును తరలించారు. దాదాపు చంద్రబాబు నాయుడు 52 రోజులు సెంట్రల్ జైలులో ఉంటున్నారు. అయితే చంద్రబాబు స్కిన్ అలర్జీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28న రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ వద్ద సరెండర్ కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజులకు ముందే చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇకపోతే ఇదే స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో దానిపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇంతలోనే ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

హైకోర్టులో సుదీర్ఘ వాదనలు

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కుడి కంటికి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాుబ నాయుడు రెగ్యులర్ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్నది. చంద్రబాబు మెడికల్ రిపోర్టులలో తప్పులు ఉన్నాయని...స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో స్కాం జరిగిందని సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారని..బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీమెన్స్ కంపెనీ కుంభకోణం జరిగిందని..నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై హైకోర్టులో కౌంటర్ వాదనలు వినిపించారు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని.. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు గుండె, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారని కోర్టుకు తెలియజేశారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగిందని..ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని అందువల్ల రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
Next Story

Most Viewed