టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. విద్యాశాఖ ఆదేశాలు ఇవే!

by sudharani |
టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. విద్యాశాఖ ఆదేశాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (ఏప్రిల్ 3) నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే సర్వం సిద్ధం చుశారు అధికారులు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పరీక్షల్లో పలు మార్పులు చేశారు.

*పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు తెలిపారు.

*24 పేజీల బుక్ లేట్ రూపంలో సమాధాన పత్రం ఉంటుంది.

*అదనంగా కావాలంటే 12 పేజీల మరో బుక్ లేట్ ఇస్తారు. *తొలిసారి ప్రశ్న పత్రాలకు సీరియల్ నెంబర్ ఇవ్వనున్నారు.

*విద్యార్థులు గ్రాఫ్, మ్యాప్ పాయింటింగ్ మీద పేరు రాయకూడదు. సీరియల్ నెంబర్ మాత్రమే వేయాలి.

*విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసురాకుడదు.

*అలాగే ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరిండిండెంట్లు, ఇతర అధికారులు సైతం సెల్ ఫోన్ తీసుకురాకుండా నిషేధించారు.

కాగా.. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 18 వరకు జరగనున్నాయి. సీబీఎస్ఈ పరీక్షల తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయం ముగిసే వరకు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు.

Next Story

Most Viewed