- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన భక్తుల రద్ధీ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్ధీ (Crowd of devotees) భారీగా పెరిగిపోయింది. నేడు మాఘపూర్ణిమ (Maghapurnima) కావడంతో మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో (30 compartments) భక్తులు వేచి ఉన్నారు. కాగా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Srivari Sarvadarshan) 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 67,192 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,825 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించుకోగా.. టీటీడీకి రూ.4.15 కోట్ల హుండీ ఆదాయం వచ్చి చేరుకొంది. కాగా ఈ రోజు మాఘపూర్ణిమ కావడంతో సాయంత్రం వరకు భక్తుల రద్ధీ (Crowd of devotees) కొనసాగడంతో పాటు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది. ఈనెల ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు పేర్కొంది. టీటీడీ (TTD) జారీ చేసిన ప్రకటన మేరకు.. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavams) జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.